ఆగస్టు 5వ తేదీన విడుదలై క్లాసికల్ హిట్ గా నిలిచింది సీతారామం సినిమా. హను రాఘవపూడి డైరెక్షన్లో ఎపిక్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు తెరకు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వగా, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పారు.
వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న, ప్రియాంక ఈ సినిమాను నిర్మించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ నటీనటులు, డైరెక్టర్, నిర్మాతల కాంబో తిరిగి రిపీట్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది.
ఇటీవలే సీతారామం సినిమాకు సీక్వెల్ ఉండదని దుల్కర్ క్లారిటీ ఇవ్వగా, లేటెస్ట్ గా వస్తున్న వార్తలో ఎంతవరకు నిజముందో అని ఆడియన్స్ అయోమయంలో ఉన్నారు.