టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జంట అక్కినేని నాగ చైతన్య- సమంత. పెళ్లికి ముందునుంచే అందరి దృష్టిని లాగేసిన ఈ జంట.. పెళ్లి తర్వాత మరింతగా అట్రాక్ట్ చేస్తూ వెళ్తోంది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ ఇద్దరూ కెమెరాకు చిక్కారంటే చాలు ఆ పిక్స్ వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా విహార యాత్రలకు వెళ్లి అక్కడ గడిపిన సరదా క్షణాల పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
శుక్రవారం నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా గోవాకు వెళ్లి.. అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు చైసామ్. ఈ సందర్భంగా భర్త చైతూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ వేడుకలోని కొన్ని పిక్స్, వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేపింది సమంత. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి తెగ చెక్కర్లు కొడుతున్నాయి. గోవాలో ఈ జంట చేసిన ఎంజాయ్ చూసి.. చైసామ్ కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పుకుంటూ తెగ ముచ్చట పడుతున్నారు అక్కినేని అభిమానులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa