‘అత్తారింటికి దారేది’ చిత్రంలో మెరిసిన కన్నడ భామ ప్రణీత ఆ తర్వాత అనుకున్నంతగా రాణించలేదు..కన్నడంలో కొన్ని మూవీలు చేసినా సరైన బ్రేక్ రాలేదు.. కాగా ప్రణీత నటనలోనే కాకుండా సేవ కార్యక్రమాల ద్వారా అందరి మనసులను దోచుకుంటున్నది.. కర్ణాటకలో తన తండ్రి పుట్టి పెరిగిన ఆలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేక అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీంతో తన సొంతూరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి సదుపాయాలు లేని అక్కడి పాఠశాలను దతత్త తీసుకుంది. ఆ పాఠశాలకు ఐదు లక్షల రూపాయలతో కనీస సౌకర్యాలు కల్పించింది. మరుగుదొడ్డి నిర్మించడంతో పాటుగా విద్యార్థుల తరగతి గదులకు మరమ్మత్తులు చేయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa