ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సీతా రామం సినిమాను చూసిన ప్రేక్షకులు మృణాల్ నటనకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారని.. తను తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరని కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్. ఇక ఇది అంతా బాగనే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం మృణాల్ ఠాకూర్‌పై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు.విషయం ఏమంటే.. సీతా రామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం కాస్తా హాటుగా, ఘాటుగా ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన సీతా రామం సినిమా అభిమానులు, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.. ఇదేంటీ.. ఇలా ఫోటోలు ఏంటీ.. అని కామెంట్స్ రూపంలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు..