బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేసారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన "శుబ్ మంగళ్ సావదాన్" కి అనఫీషియల్ రీమేక్ అని అంటున్నారు. రెండ్రోజుల క్రితం విడుదలైన స్వాతిముత్యం ట్రైలర్ అచ్చు శుబ్ మంగళ్ సావదాన్ కంటెంట్ లాగా అనిపించడంతో కొంతమంది నెటిజన్లు ఈ విషయాన్నీ తెరపైకి తీసుకొచ్చారు. ఐతే, మేకర్స్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ మూవీ డెబ్యూ హీరో బెల్లంకొండ గణేష్ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.