మంచు విష్ణు నుండి జిన్నా అనే హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ కూడా విడుదలైంది.
టైటిల్ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్లో విష్ణు మాట్లాడుతూ... ఆన్లైన్ హరాస్మెంట్ చేసే వారిపై కఠిన చర్యలు అమలు చెయ్యాలని చెప్పారు. అలానే ఒక నటుడు తనపై చేస్తున్న ఆన్లైన్ ట్రోలింగ్, హరాస్మెంట్ గురించి కూడా షేర్ చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక నటుడి ఆఫీస్ నుండే తనపై , తన ఫ్యామిలీ పై ఎక్కువగా ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయని చెప్పారు. తనను టార్గెట్ చేస్తున్నందుకు మీమర్స్ కి ఆ నటుడు భారీ మొత్తాన్నే చెల్లిస్తున్నారట. ఈ విషయంపై మరిన్ని వివరాలను త్వరలోనే తెలియచేస్తానన్నారు.
మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ పై సివియర్ ట్రోలింగ్ కు దిగుతున్న ఆ నటుడు ఎవరై ఉంటారబ్బా...??