తన నానమ్మ ఇందిరాదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది సూపర్ స్టార్ మహేష్‌బాబు కూతురు సితార.. ఇందిరాదేవి భౌతికకాయం దగ్గర మహేష్ ఒళ్లో కూర్చొని ఆమెను తల్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతుంది. మహేష్ బాబు ఓదార్చిన గాని, సితార దు:ఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. మహేష్ కూతురికి నానమ్మ అంటే ఎంతో ప్రేమ. ఆమెను చూడటానికి తరచూ కూడా ఆమె ఇంటికి వెళ్లేది. అంతే కాదు నాన్నమ్యతో చాలా టైమ్ స్పెండ్ చేసి.. ఆమెతో ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియలో శేర్ చేసేది. అటువంటి నాన్నమ్మ ఇక లేదు అని తెలిసి ఏడుపు ఆపుకోలేక పోయింది సితార. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.