"టైగర్ నాగేశ్వరరావు" మూవీతో మాస్ రాజా రవితేజ తొలిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా మేకర్స్, ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa