మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "గాడ్ ఫాదర్". నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసింది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌కు 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.