సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు నిన్న తెల్లవారు ఝామున మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖ సినీ తారలు ఇందిరాదేవి గారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కుదరని వారు సోషల్ మీడియా ద్వారా కృష్ణ, మహేష్ బాబు అండ్ ఫ్యామిలీకి సానుభూతి తెలియచేసారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కృష్ణ, మహేష్ బాబులను పరామర్శించారు. నిన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడంతో, ఇందిరాదేవిగారి పార్థివ దేహాన్ని మెగాస్టార్ సందర్శించలేకపోయారు. అందుకే ఈ రోజు ఉదయమే వారి నివాసానికి వెళ్లి, ఇందిరాదేవి గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేసారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియచేసారు.
![]() |
![]() |