వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఒక సినిమాను తెరకెక్కిస్తోంది. కిరీటి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు "జూనియర్" అనే టైటిల్ ను ఖరారు చేసి, పోస్టర్ ను విడుదల చేసారు.
వారాహి చలన చిత్రం బ్యానరుపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాన్నాళ్ల తదుపరి హీరోయిన్ జెనీలియా ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తుంది. పోతే, ఈ చిత్రానికి రాక్ స్టార్ DSP సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ మూవీ విడుదల కాబోతుంది.