బుధవారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" తెలుగు ట్రైలర్ లాంచ్ జరిగిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు లేటెస్ట్ గా గాడ్ ఫాదర్ మేకర్స్ హిందీ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి ముంబైలో గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరియు ప్రెస్ మీట్ జరగబోతుంది. ఈ విషయమై కొంచెంసేపటి క్రితమే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో కీలక అతిథి పాత్రలో నటించారు. దీంతో హిందీలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.