కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు 2020 సంవత్సరానికి గానూ ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 68వ నేషనల్ అవార్డుల కార్యక్రమం నిన్న ఢిల్లీలో జరిగింది.
ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడానికి సూర్య తన కుటుంబంతో సహా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. విశేషమేంటంటే, జాతీయ ఉత్తమ నటుడిగా సూర్య అవార్డు తీసుకుంటే, అదే వేదికపై ఆయన భార్య, హీరోయిన్, నిర్మాత జ్యోతికగారు ఉత్తమ జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు. వీరిద్దరూ కూడా ఒకే చిత్రానికి "సురారై పొట్రు" సినిమాకు ఈ అవార్డులు అందుకున్నారు.
అవార్డుల బహుకరణ తదుపరి జ్యోతిక, సూర్య పిల్లలతో సహా తమకొచ్చిన అవార్డులను ప్రదర్శిస్తూ, దిగిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.