పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో టీజర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.