ఓటీటీ సంస్థ 'ఆహా' లో నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' అనే టాక్ షో చేస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం సీజన్-2 టీజర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బాలకృష్ణ క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. సీజన్-2 టీజర్ ను విజయవాడలో మంగళవారం విడుదల చేయనున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సీజన్ కి సంబంధించి ఆంథెమ్ సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.