కేజీఎఫ్ చాప్టర్ 1,2 లతో ఇండియా వైడ్ గా సెన్సేషనల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో "సలార్" మూవీ షూటింగ్ చేస్తూ, ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ రోజు ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదుర్ పుట్టినరోజు కావడంతో, ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతూ, ప్రశాంత్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో విజయ్ ను తన పెద్దన్నయ్యగా ప్రశాంత్ పేర్కొనడం విశేషం.
కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి ఇండియానే షేక్ చేసిన కేజీఎఫ్ 1,2 లను నిర్మించింది విజయ్ కిరంగదురే. లేటెస్ట్ గా ప్రభాస్ తో సలార్ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు.