గాడ్ ఫాదర్ గా చిరు వీరోచిత్వాన్ని, మంచితనాన్ని, తనని నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే మహా మనిషి "బ్రహ్మ" గా చిరు పవర్ ఫుల్ రోల్ ను గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ లో చూపించేసారు. విడుదలకింకా రెండ్రోజుల సమయమున్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ మెగా ఫ్యాన్స్ ను మరింత ఎక్జయిటింగ్ కు గురి చేస్తుంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి గారు మెగాస్టార్ కు సరిగ్గా సరిపోయే లిరిక్స్ అందించారు.
ఇందులో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇంకా నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.