పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ టీజర్ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై, తీవ్ర నెగిటివిటీని ఎదుర్కొంది.
నటీనటుల మేకోవర్ సూటబుల్ గా లేదని, VFX చాలా చెత్తగా ఉందని, ఓం రౌత్ డైరెక్షన్ దారుణంగా ఉందని, మరి ముఖ్యంగా రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టీజర్ ను 3డి వెర్షన్ లో థియేటర్లలో ప్రదర్శింపజేసేందుకు మేకర్స్ సన్నద్ధమయ్యారు.
ఆంధ్ర, తెలంగాణాలలో సెలెక్టెడ్ థియేటర్లలో రేపటి నుండి సాయంత్రం 5-7 గంటల మధ్య ఆదిపురుష్ 3డి టీజర్ ప్రదర్శన జరగనుంది. మరి, ఈ స్క్రీనింగ్ తోనైనా ఆదిపురుష్ పై వస్తున్న నెగిటివిటి పూర్తిగా పోవాలని, డార్లింగ్ అభిమానులు కోరుకుంటున్నారు.