ఉత్తరాది భామలకన్నా దక్షిణాది భామలే ఓ అడుగు ముందుంటారని తెలిపింది నటి ఈషారెబ్బా. తెలుగమ్మాయిలు పరభాషా సినిమాలు చేస్తున్నారు కదా. మీరు ఆ దిశగా ప్రయత్నించలేదా.. అని అడిగితే..ఈ మాట చాలా మంది అడిగారు. జవాబు చెబుతూనే వస్తున్నాను. టాలీవుడ్‌లో గతంలోలాగా లేదు. టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలకు అవకాశాలు కచ్చితంగా వస్తున్నాయి. ‘టాక్సీవాలా’లో ప్రియాంక జవాల్కర్ మరాఠీ అమ్మాయే అయినా తెలుగు ప్రాంతంలోనే పెరిగింది. మరి ఆ అమ్మాయికి విజయ్ దేవరకొండతో కలిసి నటించే అవకాశం వచ్చింది కదా.. ఇప్పుడు నిర్మాతలు, దర్శకుల ఆలోచనా విధానం మారుతోంది. ఇక ఇతర భాషలలో చేసే అవకాశం వస్తే చేయడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అవకాశాలొచ్చాయి. కథనచ్చక చేయలేదంతే అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa