ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్‌లపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. పూరీ దర్శకత్వం వహించిన సినిమా 'లైగర్'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడికి తెస్తున్నారు అని తెలిపారు.