ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వీ రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం ఇష్టంగా. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. స్టార్ కమెడియన్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది.
పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో భారీ సంఖ్యలో లిప్‌లాక్స్ ఉన్నాయని సమాచారం. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఏ సినిమాలో లేని విధంగా లోనే సుదీర్ఘమైన ముద్దు సీన్ ఉన్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రయిలర్ అదరగొడుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
చిత్ర విడుదల సందర్బంగా చిత్ర యూనిట్ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హీరో అర్జున్ మహి మాట్లాడుతూ-` అమ్మాయి- అబ్బాయి సహజీవనం అంటే సెక్స్ లేదా ఇంకేదో ఊహించుకుంటారు. కానీ అంతకుమించి అని తెరపై చూస్తారు. వినోదంతో పాటు సందేశం ఆకట్టుకుంటుంది. ఈ సీజన్‌లో ఓ చక్కని రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందిస్తున్నాం ` అన్నారు.
కథానాయిక తనిష్క్ మాట్లాడుతూ.. కథాబలం ఉన్న ఈ చిత్రం. ప్రాధాన్యత గల పాత్ర కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. నటుడు దువ్వాసి మోహన్ మాట్లాడుతూ-``ప్రతి నిత్యం ఇష్టంగా ఎన్నో చేస్తుంటాం. ఆ ఇష్టాన్ని టైటిల్‌గా పెట్టుకున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ వి.రుద్ర మాట్లాడుతూ సినిమాకి రచన, సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రతిదీ బాగా కుదిరాయి. నిర్మాతలు అభిరుచితో సినిమా తీశారు. పెద్ద విజయం సాధిస్తుందన్న ధీమా ఉంది అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa