మగధీర’ సినిమాకు సంతకం చేసిన రోజు నుంచి తన సినీ కెరీర్‌లో బంగారు కాలం మొదలైందని కథానాయిక కాజల్ అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఆమె నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కాజల్‌తోపాటు కథానాయకుడు రామ్‌చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ తన కెరీర్ గురించి పంచుకున్నారు. కమల్ హాసన్ సరసన నటించబోతున్న ‘భారతీయుడు 2’ సినిమా గురించి ప్రస్తావించారు.
‘ఈ ప్రాజెక్టులో నా భాగస్వామ్యం ఉండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నా. ‘భారతీయుడు 2’ నా సినీ కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నా. ‘మగధీర’ సినిమాకు సంతకం చేసినప్పటి నుంచి నటిగా నా బంగారు కాలం ప్రారంభమైంది. నా కెరీర్‌లో అనేక ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఇవన్నీ ‘మగధీర’ తర్వాతే సాధ్యమయ్యాయి. నాకు ఈ సినిమా ఎంతో గుర్తింపు తెచ్చింది, దాన్ని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నా’ అని ఆమె అన్నారు.
అనంతరం విడుదలకు సిద్ధమవుతున్న తన తమిళ సినిమా ‘ప్యారిస్ ప్యారిస్’ గురించి కాజల్ ముచ్చటించారు. ‘హిందీ హిట్ ‘క్వీన్’ రీమేక్ ఆఫర్ వచ్చినప్పుడు.. ఈ కథను చాలా భాషల్లో తీయొచ్చనే ఆలోచన వచ్చింది. ఇది ఓ సాధారణ అమ్మాయి కథ. తమిళనాడులో ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఈ సినిమా అలాంటి వారికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తే నేను చాలా సంతోషిస్తాను’ అని ఆమె చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa