అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అనే ఆసక్తితో ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆయన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే వుండనుందనేది తాజాగా ఖరారైపోయింది. 'నా పేరు సూర్య' పరాజయం తరువాత అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఈ సారి తప్పకుండా సరైన హిట్ కొట్టాలని ఆయన భావించాడు. అలాంటి హిట్ ను తనకి త్రివిక్రమ్ అందించగలరనే నమ్మకం పెట్టుకున్నాడు. అందుకోసమే త్రివిక్రమ్ ఫ్రీ అయ్యేంతవరకూ వెయిట్ చేశాడు.
ఈ లోగా విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. చివరికి సంకల్ప్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఈ ప్రచారానికి తెరదించుతూ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తోనే చేయనున్నాడనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఇది త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న 3వ చిత్రం కావడం విశేషం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa