'చెన్నై ఎక్స్ ప్రెస్' ఫేమ్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం "సర్కస్". ఇందులో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా ఈ సినిమాలో రణ్ వీర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి పాత్రధారులను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్స్ ను విడుదల చేసారు. వచ్చే వారంలో ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు.
పోతే, ఈ సినిమా డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa