యంగ్ హీరో ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న "టాప్ గేర్" మూవీ నుండి కొంతసేపటి క్రితమే "వెన్నెల వెన్నెల" ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ వాయిస్ లో ఈ మెలోడీ మరింత బ్యూటిఫుల్ గా ఉంది. వెన్నెల వెన్నెలా..నువ్వు నా వెన్నెలా.. దైవమే ప్రేమగా ...పంపెనే నిన్నిలా.. అని సాగే ఈ సూథింగ్ మెలోడీ హీరోహీరోయిన్ల మధ్య రొమాంటికల్ సాంగ్ గా చిత్రీకరింపబడింది.
శశికాంత్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa