"హనుమాన్" సినిమాతో యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న మొదటి సినిమా ఇది. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినోద్ రాయ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
భారతదేశపు తొలి సూపర్ హీరో మూవీ గా రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజై, పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలను అందుకుంటుంది. హనుమాన్ టీజర్ పై ప్రేక్షకులు, విశ్లేషకులు, ప్రముఖ సినీతారలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తాజాగా హనుమాన్ టీజర్ ను ఒక రేంజులో పొగిడేస్తూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ట్వీట్ చేసారు. మాస్సీ, క్లాస్సీ హనుమాన్ టీజర్ ఒక గొప్ప ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది.. తేజ సజ్జా సూపర్ వర్క్.. అంటూ హనుమాన్ టీం అందరికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.