క్రేజీ హీరోయిన్ రాశీఖన్నా సినిమాల్లో నటిస్తూనే ఫస్ట్ టైం రుద్ర అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. సీనియర్ హీరో అజయ్ దేవగణ్, రాశీఖన్నా, ఈషా డియోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ 'లూథర్' సిరీస్ ను ఆధారంగా చేసికొని రూపొందించబడింది. ఈ సిరిస్ లో రాశీఖన్నా డా. ఆలియా చోక్సి అనే నెగిటివ్ రోల్ లో నటించింది.
తాజాగా రుద్ర లో రాశిఖన్నా పోషించిన నెగిటివ్ రోల్ కు గానూ ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ నెగిటివ్ రోల్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును Adgully అనే ఒక ప్రైవేట్ మీడియా హౌస్ రాశికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అవార్డు పట్టుకుని దిగిన పిక్ ను షేర్ చేసింది రాశి.