ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెహరాయి : బేబీ ఒసేయ్ బేబీ వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 07:19 PM

కొత్త దర్శకుడు రామకృష్ణ పరమహంస తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "లెహరాయి". ఇందులో రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో, మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు. విభిన్న ప్రేమకథతో, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కాబోతుంది.


ఈ సినిమా నుండి బేబీ ఒసేయ్ బేబీ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఈ పాటను సాకేత్, కీర్తన శర్మ కలిసి ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. హీరోహీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ డ్యూయెట్ సాంగ్ గా చిత్రీకరింపబడిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com