వారిసు మూవీ నుండి విడుదలైన రంజితమే ఫస్ట్ లిరికల్ సాంగ్ రోజుకొక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్గానే 2 మిలియన్ లైక్స్ తో వార్తల్లో నిలిచిన రంజితమే తాజాగా 75 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుని, ఇంకా యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో కొనసాగుతుంది.
ఈ సినిమాలో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఔటండౌట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.