రీసెంట్గా రిలీజైన "కబ్జా" టీజర్ యూట్యూబులో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్స్ స్టార్ ఉపేంద్ర, కిచ్ఛా సుదీప్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు R చంద్రు డైరెక్టర్గా వ్యవహరించారు.
తాజాగా కబ్జా టీజర్ ను హిందీలో విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు హిందీ కబ్జా టీజర్ విడుదల కాబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. ఐతే, ఒక బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ టీజర్ ను గ్రాండ్ లాంచ్ చెయ్యబోతుందట.
కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో వచ్చే ఏడాదిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందించారు. గ్లామరస్ హీరోయిన్ శ్రేయాశరణ్ ముఖ్యపాత్రలో నటించారు.