యష్ పూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం "చెప్పాలని ఉంది". ట్రైలర్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో 94వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాకు అరుణ్ భారతి L డైరెక్టర్ కాగా, అస్లాం కెయి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈరోజు చెప్పాలని ఉంది ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు హీరో నిఖిల్ సిద్దార్ధ్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ గారు చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు.