మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం "బేబీ". రీసెంట్గా రిలీజైన బేబీ టీజర్ సున్నితమైన ప్రేమకథతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. దీంతో బేబీ టీజర్ యోనులో 7.5 మిలియన్ క్యుములేటివ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
బేబీ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తుండగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ బుగ్లాని సంగీతం అందిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ తెచ్చుకున్నసెలెబ్రిటీ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.