బాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో అర్జున్ కపూర్, హాట్ బ్యూటీ మలైకా అరోరా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని నిన్నమొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే ఇప్పుడు సరికొత్తగా మలైకా ప్రెగ్నన్ట్ అన్న విషయం వైరల్ గా మారింది.
పెళ్లి కాకుండానే మలైకా, అర్జున్ కపూర్ తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నారని, ఇలాంటి వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతున్న వాళ్ళను బాయ్ కాట్ చెయ్యాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కొంతసేపటి క్రితమే అర్జున్ కపూర్ అడ్డుకట్ట వేశారు. మలైకా ప్రెగ్నన్ట్ అన్న విషయంలో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ మేరకు అర్జున్ కపూర్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేసారు. అంతేకాక ఇలాంటి చెత్త వార్తలను క్రియేట్ చేసి, ప్రచారం చేస్తున్న వాళ్ళకు తమ వ్యక్తిగత జీవితాలలో తలదూర్చే అవసరం లేదని చెప్పారు.