హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో సౌత్ ఇండియా సిజ్లింగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీ నవంబర్ 11, 2022న థియేటర్లలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 8.97 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.
'యశోద' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం - 4.38 కోట్లు
సీడెడ్ - 93 L
UA – 1.30 కోట్లు
ఈస్ట్ – 55 L
వెస్ట్ - 35 L
గుంటూరు – 61 L
కృష్ణ - 65 L
నెల్లూరు - 29 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 8.97 కోట్లు (15.80 కోట్ల గ్రాస్)