ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు సాయంత్రమే... మోస్ట్ అవైటెడ్ "చిల్ల చిల్ల" సాంగ్ రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 12:48 PM

తాలా అజిత్ అభిమానులు "తునివు" అప్డేట్ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ నేపథ్యంలో తునివు మేకర్స్ రీసెంట్గానే ఫస్ట్ లిరికల్ 'చిల్ల చిల్ల' సాంగ్ ను డిసెంబర్ 9న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ రోజు రానే వచ్చేయడంతో తాలా ఫ్యాన్స్ మరింత ఎక్జయిటింగ్ కు గురి అవుతున్నారు. ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.


ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఐదింటికి చిల్ల చిల్ల సాంగ్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పాడడం. 


హెచ్ వినోద్ డైరెక్షన్లో తాలా అజిత్ నటిస్తున్న మూడో చిత్రమిది. ఈ ఏడాది వీరి కలయికలో "వలిమై" మూవీ వచ్చింది. తునివు లో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. పొంగల్ -2023 బరిలో దిగబోతున్న బిగ్గిస్ లో ఈ సినిమా కూడా ఒకటి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com