బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత భర్త ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న చిత్రం "AS04". ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు కాత్యాయన్ శివపురి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సుశ్రి శ్రేయా మిశ్రా హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని ఒక కీలకపాత్రలో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు గారు నటించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఇది కాకుండా, సల్మాన్ ఖాన్ - వెంకటేష్ ల 'కిసీ కి భాయ్ కిసీ కా జాన్' మూవీలోనూ జగ్గూభాయ్ కీరోల్ ప్లే చేస్తున్నారు.
ఈ సినిమాతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బాలీవుడ్ రంగప్రవేశం చేస్తుంది.