బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్‌ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘పఠాన్’ ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ డేట్‌ను ప్రకటించారు. ‘పఠాన్' ఫస్ట్ సింగిల్‌ను డిసెంబర్ 12 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా దీపికా బికినీ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో జనవరి 25న రిలీజ్ కానుంది.