RRR సినిమా హాలీవుడ్ లెవెల్లో సత్తా చాటుతూ... ఇప్పటికే నాలుగు అవార్డులను అందుకుంది. తాజాగా ఒక హాలీవుడ్ సంస్థ అవార్డులలో నాలుగు నామినేషన్స్ పొంది మళ్ళీ హాట్ టాపిక్ గా వార్తల్లో నిలిచింది.
ఇంతకూ విషయమేమిటంటే, రీసెంట్గానే HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అస్సోసియేషన్) స్పాట్ లైట్ అవార్డు విన్నర్ గా నిలిచిన RRR సినిమా ఇప్పుడదే అవార్డులలో నాలుగు నామినేషన్స్ పొంది భేష్ అనిపించుకుంది. RRR సినిమాలోని చార్ట్ బస్టర్ నాటు నాటు పాట నాలుగు విభాగాల్లో (ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్, VFX - శ్రీనివాస్ మోహన్, ఒరిజినల్ సాంగ్ - MM కీరవాణి, స్టంట్స్ - కింగ్ సోలమన్) నాలుగు నామినేషన్స్ ను పొందింది.