ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవతార్ 2 సినిమా కాదు.. RGV ట్వీట్ వైరల్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 05:16 PM

వరల్డ్ వైడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ అవతార్ 2 మూవీ ఈ రోజే విడుదలైంది. దాదాపు పదమూడేళ్లకు మళ్ళీ వెండితెరపై అద్భుతమైన విజువల్ ట్రీట్ ఆవిష్కృతం కాబోతుండడంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అవతార్ 2 మ్యానియా లో మునిగిపోయారు. ఈ రోజంతా సోషల్ మీడియాలో అవతార్ 2 తెగ ట్రెండ్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ అవతార్ 2 అద్భుతం, అమోఘం, ఫాంటాస్టిక్ అని రివ్యూలు పెడుతుంటే, మన సంచలన విమర్శనాత్మక దర్శకుడు RGV మాత్రం తనదైన స్టైల్ లో అవతార్ 2 సినిమా కాదు... దానిని సినిమా అంటే పెద్ద క్రైమ్ అని ట్వీట్ చేసారు. అదేంటి... అందరికీ నచ్చిన సినిమా ఈయనకెందుకు నచ్చలేదు ... అని అనుకోకండి.. ఇది సగం ట్వీట్ మాత్రమే.


మిగిలిన ట్వీట్ ఏంటంటే, అవతార్ 2 ను సినిమా అనడం నేరం... ఎందుకంటే.. అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్.. స్పెక్టక్యూలర్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అంటూ అవతార్ 2 పై RGV సెన్సేషనల్ ట్వీట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa