ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప 2 స్పెషల్ రోల్ కోసం ... ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పోటీ..?

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 10:22 PM

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప 2 కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురుచూపులకు, వారు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలకు తగిన రీతిలో సమాధానం చెప్పేలా పుష్ప సీక్వెల్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. రీసెంట్గానే పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ ఐన విషయం తెలిసిందే కదా. పుష్పాలోని మెయిన్ రోల్స్ సీక్వెల్ లో కూడా కంటిన్యూ అవుతారని తెలుస్తుంది. అలానే సీక్వెల్ లో కథానుసారంగా కొన్ని కొత్త పాత్రలు పరిచయం అవుతాయని కూడా తెలుస్తుంది.


ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్ లో ఒక గిరిజన యువతి పాత్ర ఆడియన్స్ ను పలకరించబోతుందట. ఈ రోల్ కోసం మేకర్స్ సాయి పల్లవిని అనుకుంటున్నారట. నిజానికి ఈ విషయమై గతంలోనే భీకర ప్రచారం జరిగింది. కానీ, పుష్ప మేకర్స్ ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.


ఐతే, తాజాగా ఈ రోల్ కోసం మేకర్స్ సాయి పల్లవి పేరును పునరాలోచిస్తున్నారట. ఒకవేళ ఆమెకు కుదరకపోతే, ఐశ్వర్య రాజేష్ ను సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నారట. మరి, ఈ విషయాలపై మేకర్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో.. చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa