సూపర్‌స్టార్ రజినీకాంత్ బస్ కండక్టర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేసే రోజుల్లో MBBS చదివే ఒకమ్మాయి తరచుగా తలైవర్ డ్యూటీ చేసే బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణం చేసేది. వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఓ నాటకంలో రజినీ నటనను చూసిన ఆమె, చెన్నైలోని అడయార్ ఇన్‌స్టిట్యూట్‌కు రజనీకి తెలీయకుండానే అప్లికేషన్ పంపిదట. రజినీ అక్కడికి వెళ్లడానికి డబ్బులు కూడా ఇచ్చి, ‘నీకు ఉన్న టాలెంట్‌కి నువ్వు నటనలో ఎంతో ఎత్తుకు ఎదగగలవు. ప్రపంచంలోనే గొప్ప నటుడివవుతావు' అని పట్టుబట్టి పంపిందట. ఆయన అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయి వచ్చాక ఆమె కోసం చాలా వెదికినా ఆచూకీ దొరకలేదట. అప్పటి నుంచి ఇప్పటివరకు రజనీకాంత్‌కి ఆ అమ్మాయి కనిపించలేదట. ఇప్పటికీ రజనీ ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఆయన కళ్లు ఆ అమ్మాయి కోసం వెతుకుతాయని ఆయనే స్వయంగా చెప్పారట. తాను సూపర్ స్టార్ దాని కోసం ఆ అమ్మాయి తన దగ్గరకు రాలేదని, ఆ అమ్మాయి గొప్పతనం అదేనని రజనీ చెప్పారట.