తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా "వారిసు". తెలుగులో వారసుడు టైటిల్ తో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, మెగాపవర్ స్టార్ రాంచరణ్ చెన్నైలో 'వారిసు' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నారట. తలపతి విజయ్ ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గానూ సినిమా చూసిన రాంచరణ్ ఆయనకు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారట.
ప్రకాష్ రాజ్, జయసుధ, ప్రభు, శ్రీకాంత్, సంగీత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.