నాచురల్ స్టార్ నాని హీరోగా నిన్ననే ఒక కొత్త మూవీ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో నాని సరసన నటించేందుకుగానూ మృణాల్ కోటిన్నర డిమాండ్ చేసిందని వినికిడి. బేరసారాల తదుపరి మేకర్స్ ఆమెకు కోటిరూపాయల భారీ పారితోషికం ముట్టజెప్పి తమ సినిమాలో ఫిక్స్ చేసుకున్నారట. సీతారామం సినిమాతో ఇక్కడ చాలా మంచి గుర్తింపు సంపాదించిన మృణాల్ నాని 30 మూవీతో ఆ ఇమేజ్ ను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.
ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది.