కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, గాయకుడిగా తనలోని విభిన్న ప్రతిభను ప్రేక్షకులకు కనబరచి, వారి విశేష ఆదరణకు నోచుకుంటున్న కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్. ఒకపక్క సినిమాలకు సంగీతం అందిస్తూనే, మరోపక్క నటుడిగా రుజువు చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ నుండి ఈ రోజు న్యూ మూవీ ఎనౌన్స్మెంట్ జరిగింది. తమిళంలో 'కల్వన్', తెలుగులో 'చోరుడు' టైటిల్స్ తో ఎనౌన్స్ చెయ్యబడిన ఈ సినిమాల యొక్క ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కాబోతున్నాయి. పోతే, ఈ సినిమాను యాక్సెస్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, జి ఢిల్లీ బాబు సమర్పిస్తున్నారు.