వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న "గీతసాక్షిగా" సినిమా నుండి కొంతసేపటి క్రితమే 'అడుగులో అడుగులే' రొమాంటిక్ మెలోడీ లిరికల్ వీడియో విడుదలైంది. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ పాటను డిజిటల్ లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ ను తెలియచేసారు. సింగర్స్ అమృతా సురేష్, శ్రీకృష్ణ ఆలపించిన ఈ పాటకు రెహ్మాన్ లిరిక్స్ అందించారు. గోపిసుందర్ స్వరపరిచారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 26వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది. చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆంథోనీ మట్టుపల్లి డైరెక్ట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa