అడివిశేష్ హీరోగా రీసెంట్గానే "గూఢచారి 2" మూవీ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. హిట్ కాంబో డైరెక్టర్ శశికిరణ్ తిక్కా - హీరో శేష్ కలయికలో తొలిగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ "గూఢచారి" కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చెయ్యనున్నారు. ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ ని ఒక ప్రీ విజన్ వీడియోతో జనవరి 9న ఢిల్లీ, ముంబైలలో జరగబోయే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లలో అధికారికంగా ఎనౌన్స్ చెయ్యనున్నారు. ఈ విషయం తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ లో కూడా గూఢచారి 2 లాంచ్ ఈవెంట్ జరుగుతుందని శేష్ ట్వీట్ చేసారు. ఈ మేరకు జనవరి 9న ముంబై, 10న హైదరాబాద్ లలో గూఢచారి 2 ఒక ప్రీ విజన్ వీడియోతో అధికారికంగా లాంచ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa