నిన్న విడుదలైన ట్రైలర్ తో "కళ్యాణం కమనీయం" సినిమా ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ 'అయ్యో ఏంటో' సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతుందని ప్రకటించారు. స్వీకర్ అగస్తి పాడిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. శ్రావణ్ భరద్వాజ్ స్వరపరిచారు.
సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా, అనిల్ కుమార్ ఆళ్ల డైరెక్షన్లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa