డిసెంబర్ 23న థియేటర్లకు వచ్చిన "ధమాకా" మూవీ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి ఒక్కో పాట టీజర్ ను విడుదల చేస్తూ వస్తున్న మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి హిలేరియస్ "దండకం" టీజర్ ను విడుదల చేసారు. ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. పల్సర్ బైక్ తదుపరి ధమాకాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ ఎపిసోడ్ ఇదే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa