ప్రఖ్యాత రాక్ అండ్ రోల్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మారి(54) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో లీసా మృతిచెందినట్లు ఆమె తల్లి ప్రిసిల్లా ప్రెస్లీ తెలిపారు. కాగా, లీసా ప్రెస్లీ కూడా సింగర్ గా రాణించారు. లీసా మొత్తం మూడు ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. 2003లో తన మొదటి ఆల్బమ్ రిలీజ్ చేయగా, పాజిటివ్ రివ్వ్యూస్ వచ్చాయి. లీసా మొత్తం నలుగురిని పెళ్లాడగా, ఈ లిస్టులో మైఖేల్ జాక్సన్ కూడా ఉన్నాడు.