సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో తాలా అజిత్ "తునివు" ఒకటి. జనవరి 11న తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. హెచ్ వినోద్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు.
పోతే, తమిళనాడులో ఈ సినిమాకు భీభత్సమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఐతే, ఇందులో పెద్ద విశేషమేమీ లేదు కానీ, USA ఆడియన్స్ నుండి ఈ సినిమాకు గుడ్ అప్లాజ్ రావడం విశేషం. దీంతో ఈ సినిమా usa కలెక్షన్లు హాఫ్ మిలియన్ కు చేరుకున్నాయి. ఇప్పటివరకు తునివు/ తెగింపు మూవీ USAలో 462కే డాలర్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా అజిత్ కెరీర్ లో USA బెస్ట్ హైయెస్ట్ గా నిలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa